జగన్ అంటే జంకుతున్నారా ? అయ్యో కేటీఆర్ ను కూడా లాగారే..! - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ అంటే జంకుతున్నారా ? అయ్యో కేటీఆర్ ను కూడా లాగారే..!

August 5, 2017

జగన్ ను విమర్శించే క్రమంలో  టిడిపి సోషల్ మీడియా సైన్యం కేటీఆర్ ని కూడా వాడుతున్నారు. కేటీఆర్  చెప్పిన పిట్టకథను,జగన్ అప్పచెప్పాడనేది ఈ పోస్ట్ సారాంశం.

సోషల్ మీడియాలో  వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత  జగన్ పై మూకుమ్మడి దాడి ప్రారంభమైంది.రకరకాల ఫేక్ అకౌంట్స్ తో ఫేస్ బుక్ లో జగన్ ను,ఆయన అనుచర గణాన్ని టార్గెట్ చేస్తూ,పోస్టులు కనిపిస్తున్నాయి.జగన్ కు బహిరంగలేఖ అంటూ జగన్ పరిణామ క్రమం పేరుతో ఓ పోస్ట్ హల్చల్ చేస్తుంది.అయితే ఈ పోస్టులో విషయం అంతంత మాత్రమే.

వెన్నుపోటుకు పేటెంట్ రైట్స్ జగన్ &కో సొంతం అంటూ  రాజారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి ల ఫోటోలతో మరో పోస్ట్.నంద్యాలలో రోజాకు పట్టపగలే చుక్కలు అంటూ ఇంకో పోస్ట్.

చంపే అలవాటు తండ్రీ కొడుకులదే,పరిటాల రవిని చంపింది వీళ్లే.ఇంతటితో ఆగకుండా “తెలుగు సైన్యంలో మీ రుషి “అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీ ఇంకా చెప్పలేని ఎన్నో బూతులతో జగన్ ను డీలా పరిచే ప్రయత్నాన్ని టీడిపి వేగవంతం చేసింది.కొడకా టచ్ చేసి చూడరా,పల్నాటి దెబ్బ పడితే నీ తాతా,అయ్య కంటే హీనంగా తేలిపోతావంటూ జగన్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖలో కన్నతల్లిని,కడపలో సొంత చిన్నానను గెలిపించుకోలేని వాడు నంద్యాలలో శిల్పాన్ని గెలిపిస్తాడట.

ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫేస్ బుక్ ,వాట్సప్ ల నిండా తెలుగుదేశం కార్యకర్తలు బినామీల పేర్లతో ఒకటే ప్రచారాలు.అయితే వారి రాతలను చూస్తే స్పష్టమైన అసహనం కనిపిస్తుంది.జగన్ నేరుగా ఎదుర్కోలేక ఫొటో షాప్ పైన ఆధారపడ్డట్టు తెలిసిపోతుంది.

నిన్నటి వరకు సోషల్ మీడియాలో జగన్ టీమ్ ముందు వరుసలో కనిపించింది.కానీ సడన్ గా టిడిపి సోషల్ మీడియాను ఆక్రమించుకునే ప్రయత్నాన్ని స్పీడ్ అప్ చేసింది.

ఏది ఏమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వార్త ఓట్లను రాలుస్తుందో లేదో వేచి చూడాలి.