నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీఈసీ తెలిపింది. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేసింది. జగన్ వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జగన్పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ అధినేతకు కొత్త చిక్కు ఎదురైంది.