కాళ్లు బొబ్బలెక్కినా.. మడమ తిప్పకుండా.. - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు బొబ్బలెక్కినా.. మడమ తిప్పకుండా..

November 30, 2017

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర నిరాటంకంగా సాగుతోంది. జగన్ ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలను వింటూ ముందుకుసాగుతున్నారు. ఆయనకు నడచీనడిచీ కాళ్లు బొబ్బలెక్కాయి. ఒక కాలిలో ముల్లు కూడా గుచ్చుకుంది. ఈ బాధలను లెక్క చేయకుండా ఆయన ముందుకెళ్తున్నారు. పాదయాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.  గ్రామ మహిళలు ఆయనతో తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. జగన్ మాట్లాడుతూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చదువులకు భరోసా ఉండేదని, ప్రస్తుత చంద్రబాబు సర్కారు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే చదువుల విప్లవాన్ని మళ్లీ తీసుకొస్తామన్నారు. ఫీజులు ఎంతైనా సరే తామే భరిస్తామన్నారు. పింఛను మొత్తాన్ని రూ.1వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతామని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.