ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. నిషేధం ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. నిషేధం ఎత్తివేత

June 7, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.జూన్‌ 8 నుంచి 17వరకు సాధారణ బదిలీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ బదిలీల్లో ఒకే చోట ఐదేళ్లు పని చేసిన వారికి బదిలీ తప్పనిసరిస్తూ, అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించడమే ప్రభుత్వ విధానమని, మెరుగైన పాలన, సమర్థవంతమైన ప్రజా సేవల కోసం, పరిపాలనలో సమర్ధత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి సిబ్బందిని సరైన స్థానంలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూచించారు. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతోపాటు, పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.