Jagan Sarkar's sweet kaburu for students
mictv telugu

విద్యార్థులకు జగన్ సర్కార్ తీపికబురు..4,72,472 మందికి పంపణీ

September 8, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కారో ఓ తీపికబురు చెప్పింది. రూ.606.18 కోట్లతో 4,72,472 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు, ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల(50,194 మంది)కి కూడా రూ.64.46 కోట్లతో ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి పచ్చ జెండా ఊపింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్ష బుధవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. అనంతరం మంత్రివర్గం ఆమోదం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు, వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

”నవంబర్‌లో ట్యాబ్‌లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నాం. ప్రతి ట్యాబ్‌లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, అదనంగా 64 జీబీ మెమొరీ కార్డ్, మూడేళ్ల వారంటీ. మార్కెట్‌లో రూ.16,446 విలువున్న ట్యాబ్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843కే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మొత్తంగా రూ.187.84 కోట్లు ఆదా అవుతోంది. ట్యాబ్‌తో పాటు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేసి ఇవ్వనున్నాం. మొత్తంగా ఒక్కో విద్యార్థికి రూ.36,843 లబ్ది కల్గనుంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025లో పదో తరగతి పరీక్షలను సీబీఎస్ఈ విధానంలో రాయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.