వై నాట్ 175 వర్సెస్ లాస్ట్ సెంటిమెంట్
ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. 2024 ఎన్నికలే టార్గెట్‌గా వైసీపీ, టీడీపీలు దూకుడు పెంచాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డెవలప్‌మెంట్ అస్త్రాన్ని బలంగా నమ్ముకున్నారు.చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. వై నాట్ 175 వర్సెస్ లాస్ట్ ఎలక్షన్స్ సెంటిమెంట్‌లతో ఎలక్షన్ వార్ జరగబోతుందా?డెవలప్‌మెంట్ వర్కౌట్ అవుతుందా?40 ఇయర్స్ ఇండస్ట్రీ సెంటిమెంట్ పండుతుందా?
వై నాట్ 175
వై నాట్ 175…ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోట వినిపిస్తున్న మాట. పార్టీ సమావేశాలు, సభల్లో ఇదే తారకమంత్రం వినిపిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి బాగా జరుగుతుంది…ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు…175 కి 175 సీట్లు ఎందుకు రావు అని జగన్ వైసీపీ నేతల్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. నేను చేసేది నేను చేస్తున్నా..గెలేచే బాధ్యత మీదెనంటూ గతంలో ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. ఇదే లక్ష్యంతో 2024 ఎన్నికలకు వెళ్లబోతున్నామని స్పష్టంగా చెప్పారు. పనితీరు బాగోలేదని కొంతమంది ఎమ్మెల్యేల్ని హెచ్చరించారు. ఎన్నికల సమయం బాగా ఉందని ఈలోపు లోటుపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. ఇలా చేస్తే వై నాట్ 175 ఎందుకు సాధ్యం కాదని జగన్ అంటున్నారు.
సక్సెస్ అవుతుందా..బెడిసి కొడుతుందా?
వై నాట్ 175 జగన్ నినాదం వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? ప్రజలు అన్ని సీట్లు వైసీపీకి కట్టబెడుతారా?నో ఛాన్స్..ఎందుకంటే ఎంతబాగా పనిచేసినా ఎక్కడో ఓ చోట అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు ఉండాలని జనం మనస్సుల్లో ఉంటుంది. మొత్తానికి మొత్తం గెలిపిస్తే మొదటకే మోసం వస్తుందని వారిలో బలమైన నమ్మకం. అందుకే వై నాట్ 175 నినాదం వర్కౌట్ డౌటే.ఒక్కోసారి అసలకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇండియా షైనింగ్ నినాదాన్ని నమ్ముకుని బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. కానీ జనం షైనింగ్ ఎక్కడలేదంటూ కమలాన్ని ఇంటికి పంపించేశారు.
బాబు చివరి ఎన్నికల సెంటిమెంట్
జగన్‌ను ఢీ కొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీశారు. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. గెలిపిస్తారో,ఓడిస్తారో తేల్చుకోవాలని జనాల్లో సెంటిమెంట్ రగిల్చారు. "నేను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నా. మీకోసం సమర్థంగా పనిచేస్తా. ఏపీ రూపురేఖలు మారుస్తా…ఇవే నాకు చివరి ఎన్నికలు..భవిష్యత్‌లో మళ్లీ పోటీచేయను. గెలిపిస్తారో.ఓడిస్తారో మీ ఇష్టం "అని చంద్రబాబు అన్నారు. కర్నూలు పర్యటనలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తమ్ముళ్లూ తేల్చుకోండి అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని వదిలారు.అధికారంలోకి వస్తే వైసీపీ వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.
ఈసారి రాకపోతే…
నిజానికి ఈ సారి చంద్రబాబుకు, తెలుగుదేశానికి డూ ఆర్ డై ఎన్నికలు. 2024లో గెలిచి తీరాలి. లేదంటే టీడీపీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. చంద్రబాబు వయస్సు పైబడుతుంది. ఆయన తర్వాత పార్టీని నడిపించే నేత కనిపించడం లేదు. బాలయ్య ఎలాగూ ప్రత్యామ్నం కాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్లీ టీడీపీకి వెలుగు. చినబాబు చూపులంతా సినిమాలపైనే. ఒకవేల వచ్చినా ప్రచారానికే పరిమితం. అందుకే ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు..చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్‌తో కొడుతున్నారు. చూడాలి బాబు ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయో లేదో…