మహిళల సంఘటిత శక్తికి నిదర్శనం ఈ కథనం. కేవలం మహిళలు మాత్రమే పెట్టుబడి పెట్టి వారే నిర్వహించుకుంటూ ఏడాదిలోనే లాభాల బాట పట్టిన వైనం అందరికీ ఆదర్శప్రాయం. కేవలం పది లక్షల పెట్టుబడితో ఏడాదిలోనే కోటి టర్నోవర్ సాధించిన జగనన్న మహిళా మార్ట్ విజయప్రస్థానాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ శుక్రవారం ట్విట్టర్లో వీడియో ద్వారా వెల్లడించింది.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో గతేడాది ఈ జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటయింది. పులివెందులలో 1270 పొదుపు సంఘాలు ఉండగా, వాటిలో 8వేల మంది సభ్యులున్నారు. ఒక్కొక్కరికి రూ. 150 ఇచ్చి రూ. 12 లక్షలు మార్ట్ పెట్టుబడికి సమకూర్చారు. దీంతో సూపర్ మార్కెట్ ప్రారంభించి అనతికాలంలోనే వినియోగ దారుల అభిమానాన్ని సంపాదించారు. మొత్తం మహిళలలోనే నిర్వహించబడుతున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ఏడాదిలోనే కోటి టర్నోవర్ సాధించడం విశేషం. బహిరంగ మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో తక్కువ కాలంలోనే ఈ మార్ట్ అభివృద్ధి చెందింది.
పులివెందులలో 1270 పొదుపు సంఘాల్లో 10,200మంది సభ్యులు ఒక్కొక్కరు రూ.150 చొప్పున పొదుపు చేసి రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ‘జగనన్న మహిళా మార్ట్’ ఒక్క ఏడాదిలోనే కోటి రూపాయలకు పైగా టర్నోవర్తో లాభాలబాటలో కొనసాగుతోంది.@ysjagan#JaganannaMahilaMart #YSJaganEmpowersWomen #APDC pic.twitter.com/BaZrUNdfit
— AP Digital Corporation (@apdigitalcorp) July 22, 2022