Jagannath's treasury which arouses excitement..Tunnel to the secret room
mictv telugu

ఉత్కంఠ రేకెత్తిస్తున్న జగన్నాథుని భాండాగారం..గదికి సొరంగం

August 30, 2022

Jagannath's treasury which arouses excitement..Tunnel to the secret room

ఒడిశా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. ఈ ఆలయం హిందూ దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం.. కృష్ణ భక్తులకు, విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైంది. ఆలయంలో విగ్రహాలన్నీ చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. భక్తులకు ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు.

అయితే, ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న ఓ రహస్య గదికి సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారం గది ఒకటి ఉందని, ఆ భాండాగారానికి మూడోవ గది నుంచి సొరంగ మార్గం కూడా ఒకటి ఉందని, అందులో అపారమైన సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ రహస్య గదిని 1926లో ఆనాటి బ్రిటిష్ పాలకులు రత్న భాండాగారం తెరిపించారు. అప్పట్లో చైన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారు. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను పేర్కొన్నారు. సంపద వెలకట్టలేమని, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో విలేకరులకు తెలిపారు.

చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర పేర్కొన్న వివరాల ప్రకారం..”రహస్య గది దిగువన సొరంగ మార్గం ఉంది. దాని కింద మరిన్ని గదులు ఉన్నట్లు అప్పట్లో చెన్నై నిపుణులు తెలిపారు. మేము కూడా భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్లలేకపోయాం. లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు మాకు వినిపించాయి. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ (ఒడిశా)ను పాలించిన 46 మంది రాజులు పురుషోత్తముడి భక్తులు వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచారు” అని ఆయన వెల్లడించారు.