Home > విద్య & ఉద్యోగాలు > ఏపీ: ప్రభుత్వ ఉద్యోగాలపై జగన్ స్పష్టత..

ఏపీ: ప్రభుత్వ ఉద్యోగాలపై జగన్ స్పష్టత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికారపక్షంపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సభ నుంచి వాకౌట్ అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని నోఫిటికేషన్లు ఇచ్చారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఇవికాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ లో 3.71 లక్షల ఉద్యోగాలు..మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 83–84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు" అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల దశాబ్దాల వారి కల నెరవేరుస్తూ 51,387 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో రికార్డు స్థాయిలో 16,880 రెగ్యులర్ ఉద్యోగాలు, పాఠశాల విద్యా శాఖలో 6,360 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 'ఆప్కాస్ క్రియట్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గొప్ప మేలు చేశామని, ఇప్పుడు 95,212 మంది ఆప్కాలో జీతాలు తీసుకుంటున్నారని వివరాలను వెల్లడించారు.

Updated : 19 Sep 2022 10:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top