జగన్ పెంపకం బాగాలేదు, రాజశేఖర్ రెడ్డిని అనొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ పెంపకం బాగాలేదు, రాజశేఖర్ రెడ్డిని అనొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

May 2, 2022

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకు వెడెక్కుతుంది. అధికార పార్టీ నాయకుల మధ్య ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా కొనసాగుతోంది. గతకొన్ని నెలలుగా రాజకీయంగా వ్యాఖ్యలు చేయటం మాని, వ్యక్తిగతంగా దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ పెంపకం బాగాలేదు, రాజశేఖర్ రెడ్డిని అనొద్దు’ అంటూ పరోక్షంగా జగన్ వ్యక్తిగతం జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు.

ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..” ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది. ఆమె ఎలా పెంచిందో అడిగి తెలుసుకుంటాను. ఆమె చెప్పింది కరెక్టే. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కూడా కష్టం అయ్యింది. వాళ్ల పెంపకం మంచిదే కానీ, అప్పటికే జగన్ డైవర్ట్ అయ్యి వాళ్ల రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని ఆయన అన్నారు.

మరోపక్క ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘ప్రబోధానంద ఆశ్రమం కేసులో ఎస్పీ అనే దేవుడి దగ్గరికి నేను వెళ్లాను. ఆయన చేతుల్లో ఏమిలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఫైల్ ఉంది. తాడిపత్రి నాయకులు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారు. 46 మందిలో 35 మంది ముస్లింలే. ఇంత దారుణమా.. ఈ కథేంటో సజ్జలే చెప్పాలి’ అని అన్నారు.