రీల్లో కాదు... రియల్ హిరో... ఆయనే...... - MicTv.in - Telugu News
mictv telugu

రీల్లో కాదు… రియల్ హిరో… ఆయనే……

July 12, 2017

తెలుగు సిన్మ ఇండస్ర్టీలో  రీల్లోనే కాదు… రియల్ లైఫ్   హిరో ఎవరంటే…ఆ స్టార్… ఈ స్టార్…అని కాదు… ఏకైక స్టార్… ఉన్నదున్నట్లు చెప్పే రియల్ స్టార్  జగపతి బాబే. ఈ మధ్య కాలంలో ఆయన  పలు టీవిలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా పటేల్ సర్ సిన్మ గురించి ఆయన  మాట్లాడిన మాటలు కూడా ఔరా… తెలుగులో ఇంత సూటిగా మాట్లాడే హీరో  ఉన్నాడా అన్పిస్తుంది.

తన  సిన్మ గురించి మాట్లాడినా… జీవితం గురించి మాట్లాడినా జగపతి బాబు ఉన్నదున్నట్లు చెప్తున్నాడనిపిస్తుంది. తన సిన్మ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో సిన్మా గురించే కాదు… తన సంపాదన విషయాల గురించీ చెప్పారు. మనిషి బతకడానికి కేవలం 40 కోట్లు చాలు… అవి ఎందుకూ అంటే నలుగురు ఇంట్లో ఉన్నారు… మంచి జీవితం కావాలంటే.. ఇది చాలని చెప్పారు. కోట్లకు కోట్ల రూపాయలు ఎందుకు సంపాదిస్తారో అర్థం కాదని చెప్పారు.  బతకడానికి ఉంటే సరిపోతుందని చాలా మంది అంటారు. జగపతిలా ఎందరుంటారో  తెలియదు.

ఇంతకు ముందు కూడా తన కూమార్తె పెండ్లి విషయంలో తన సొంతం కులం వారు చేసిన కుట్రల గురించి  కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.  నీవు బతికున్నప్పుడు అనుభవించిందే నీ అనుభవంలో ఉంటుంది… లేనీ లోకాన్ని, ఉహాలకు జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు. ఆయన సమకాలీకుల్లో.. ఒక  హిరోగా,  విలన్ గా, క్యారెక్టర్  ఆర్టిస్ట్ గా, మళ్లీ హీరోగా ఇన్ని రోల్స్ చేస్తున్న ఏకైక కథానాయకుడు… రియల్ హిరో… జగపతి బాబే.