బెల్లం తియ్యగా ఉంటుంది. చూడ్డానికి రాయిలా గట్టిగా ఉన్నా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. చాలా మందికి ఉత్తి బెల్లం తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో ఏ స్వీటూ లేనప్పుడు బెల్లాన్నే స్వీటులా తినేస్తుంటారు. పంచదార కంటే బెల్లం చాలా మంచిదని కూడా అంటారు. టీ, కాఫీల్లో కూడా బెల్లాన్ని వేసుకోండి అని చెబుతుంటారు. మరి అలాంటి బెల్లం ఆరోగ్యాన్ని కాదు అందాన్ని కూడా ఇస్తుందని మీకు తెలుసా. తెలియదా…అయితే ఇప్పుడు తెలుసుకోండి.
బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్సు, విటమిన్ సి, బి2, ఈ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కొంచెం బెల్లం తింటే బీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అజీర్తి, మలబద్దకం, నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు, రక్తహీనత లాంటి సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. అయితే బెల్లం కేవలం ఆరోగ్య సంరక్షణకే కాదు.. చర్మం, జుట్టును సంరక్షించుకోవడానికి కూడా సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షిస్తుంది. డల్‌గా ఉన్న హెయిర్‌ను మెరిపిస్తుంది. బెల్లం మన డైట్‌లో చేర్చుకున్నా, లేదా అప్లై చేసుకున్నా కూడా సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
రోజూ కొంచెం బెల్లం తింటే అందులో ఉండే ఐరన్, క్యాల్షియం వల్ల చర్మంలోని మలినాలు,బ్లాక్ హెడ్స్ తొలగిపోయి మొటిమలు రాకుండా చేస్తుంది. అర చెంచా బెల్లం పొడిని తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మొటిమల వల్ల వచ్చే బ్లాక్ హెడ్స్, మచ్చలపై అప్లై చేసి.. 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లనీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమల మచ్చలు త్వరగా మాయం అవుతాయి.
బెల్లంలో సెలీనియంతో సహా శక్తివంతమైన మినరల్స్ ఉంటాయి. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. నవ్వుల నూనెలో కొంచెం బెల్లం పొడి, కాస్త అలోవెరా జెల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత ముఖాన్ని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గి.. యవ్వనంగా కనిపిస్తారు.
బెల్లంలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. గ్లైకోలిక్ యాసిడ్‌ను బ్యూటీ ప్రొడెక్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రెండు స్పూన్ల బెల్లం పొడి తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బెల్లం మన చర్మంలోని మలినాలను తొలగిస్తుంది, చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌తో ముఖానికి సరికొత్త గ్లో వస్తుంది.
బెల్లంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది న్యాచురల్ క్లెన్సర్‌లా పని చేస్తుంది. చర్మం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు తేలికపాటి డిటాక్స్‌గా పనిచేస్తాయి. ప్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది తలకు కూడా రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ చేస్తుంది. మన డైట్‌లో బెల్లం తరచుగా తీసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు ఫాస్ట్‌గా పెరుగుతుంది, బెల్లం జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తుంది.
బెల్లం రెండు టీ స్పూన్లు, ముల్తానీ మట్టి రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు కొద్దిగా తీసుకుని.. ఈ మూడింటినీ మిక్స్ చేసి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్ మీ తలకు, జుట్టుకు పట్టించండి. 20 నిమిషాలు ఆరనిచ్చి, మైల్డ్ షాంపుతో తలను శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే.. మెరిసే జుట్టు మీ సొంతం.