Home > మరో బర్ఫీ జగ్గా జాసూస్ అవుతుందా ?

మరో బర్ఫీ జగ్గా జాసూస్ అవుతుందా ?

‘ బర్ఫీ ’ కాంబినేషన్ లో వస్తున్న ‘ జగ్గా జాసూస్ ’ సినిమా మీద ఇప్పటికే చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. జూలై 14 ఎప్పుడొస్తుందా అని చాలా మంది రణ్ భీర్ కపూర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలియానాకు బాలీవుడ్ లో చక్కని బోణీ ఇచ్చిన సినిమా బర్ఫీ. అలాగే రణ్ భీర్ కపూర్ లోని ఎక్స్ ట్రార్డినరీ నటుడుని బయటకు తీసిన సినిమా అదే. దర్శకుడు అనురాగ్ బసుకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాగా బర్ఫీ హిస్టరీలో నిలిచిపోతుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ‘ జగ్గా జాసూస్ ’ ఏ రేంజ్ లో వుంటుందనేది చాలా మంది చాలా అంచనాలు వేస్కుంటున్నారు.

ఖచ్చితంగా మంచి సినిమానే వస్తుంది అనే ధీమాలో కూడా వున్నారు ఫ్యాన్స్. ఇదొక అడ్వెంచరస్ కామెడీ జోనర్ సినిమా అంటున్నారు. రణ్ భీర్ పక్కన కత్రినా కైఫ్ నటిస్తోంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయంట్ ఏమిటంటే ఇందులో గోవిందా కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ విశేషమేమిటంటే ఈ సినిమాను డిస్నీ సంస్థ నిర్మించడం. చూడాలి మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్లను క్లబ్ చేస్కొని, బర్ఫీ రికార్డులను ఈ ’ జగ్గా జాసూస్ ‘ బద్దలు కొడుతుందో లేదో !?

Updated : 23 Jun 2017 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top