రేవంత్‌ను కలిసిన జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్‌ను కలిసిన జగ్గారెడ్డి

March 11, 2022

10

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం కలిశారు. సీఎల్పీ కార్యాలయంలో ఇద్దరు నేతలు యాధృచ్ఛికంగా ఎదురుపడడంతో మొదట జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డిని పలకరించారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాలు వీరి భేటీ జరిగింది. బయటికొచ్చాక మీడియా ముందు ఇద్దరు నేతలు కరచాలనం చేసుకొని ఫోటోలు దిగారు. ఏం మాట్లాడారన్న మీడియా ప్రశ్నకు ఇప్పుడు బహిరంగంగా చెప్పలేనంటూ జగ్గారెడ్డి సమాధానం దాటవేశారు. కాగా, గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతోపాటు పార్టీలో తనకు అవమానం జరుగుతుందంటూ జగ్గారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతానని ఇటీవలే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో వీరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.