Jaggareddy angry on ys Sharmila
mictv telugu

జగన్‌ను దింపి ఈ వ్యక్తిని సీఎం చేయండి.. వైఎస్ విజయమ్మకు సలహా

September 27, 2022

Jaggareddy angry on ys Sharmila

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసుకుంటున్న పొలిటికల్ ఆరోపణలు హీట్ పుట్టిస్తున్నాయి. జగ్గారెడ్డి టీఆర్ఎస్ ఏజెంట్ అని షర్మిల ఆరోపించగా, దానికి కౌంటర్‌గా జగ్గారెడ్డి మంగళవారం విరుచుకుపడ్డారు. తనను రెచ్చగొట్టవద్దని, మరో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తే అన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినా సీఎం కాలేరని, అన్నతో పంచాయితీ ఉంటే ఏపీలో పాదయాత్ర చేయాలి కానీ, తెలంగాణలో ఏం పని అని విమర్శించారు. ‘వైఎస్ విజయమ్మకు ఓ సలహా ఇస్తున్నా. మీ కొడుకు జగన్‌కు నచ్చజెప్పి షర్మిలను ఏపీ సీఎంగా చేయండి. తెలుగు రాష్ట్రాలకు మీ కుటుంబం వారే సీఎంలుగా ఉండాలా? ఏపీలో మూడు రాజధానులు పెట్టేకంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విడగొట్టి ఒక్కోదానికి జగన్, షర్మిల, విజయసాయి రెడ్డిలను సీఎంలుగా పెట్టుకోండి. విశాఖ, అమరావతి, కడప రాజధానులుగా పరిపాలించుకోండి. ఇటీవలే పార్టీ పెట్టిన షర్మిల వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటోంది. నాకు కేటీఆర్ అపాయింట్‌మెంటే దొరకదు. అలాంటిది నన్ను ఆ పార్టీ కోవర్ట్ అంటారా? అని మండిపడ్డారు.