ఫోర్బ్స్ జాబితాలో జగిత్యాల జిల్లా వాసి.. ఏకంగా 30 బిలియన్ డాలర్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఫోర్బ్స్ జాబితాలో జగిత్యాల జిల్లా వాసి.. ఏకంగా 30 బిలియన్ డాలర్లు

May 3, 2022

తెలంగాణలోని జగిత్యాల వాసి సాగి రఘునందన్ రావు అనే వ్యక్తి అమెరికాలోని ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అసమాన ప్రతిభతో ‘ఫోర్బ్స్ సీఈవో – 2022’ లిస్టులోకి ఎక్కాడు. అమెరికాలోని అట్లాంటాలో నివాసముంటున్న ఈయన, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ అనే సంస్థలో సీఈవోగా పని చేస్తున్నారు. నేపథ్యమిదీ పెగడపల్లి మండలం వెంగళాయిపేట నివాసి అయిన డాక్టర్ సాగి సంజీవరావు కుమారుడైన రఘునందన్.. ప్రాథమిక విద్యను వరంగల్‌లో పూర్తి చేశారు. జగిత్యాలలో హైస్కూలు, గుంటూరు విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1992లో అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీలో ఎంఎస్ చదివారు. అనంతరం కాస్మొటిక్ కంపెనీలో చేరి, అంచెలంచెలుగా వాల్‌మార్ట్ డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇన్‌స్పైర్ కంపెనీ సీఈవోగా కంపెనీ అమ్మకాలను 30 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు) సాధించారు. దీంతో ఆయన పనితీరును మెచ్చుకొని జాబితాలో చోటిచ్చారు. కాగా, రఘునందన్ సాధించిన ఘనతను అతని తల్లిదండ్రులు, స్నేహితులు వేడుకగా జరుపుకుంటున్నారు.