jagityal journalist jameer Body found in floods
mictv telugu

వరదల్లో కొట్టుకుపోయిన జర్నలిస్టు మృతదేహం లభ్యం

July 15, 2022

మూడు రోజుల కింద జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ తన కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టడంతో గురువారం కారు బయటపడగా, శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించారు. కాగా, జమీర్ మృతిపై ఎమ్మెల్సీ కవిత తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వార్తా సేకరణకు వెళ్లే జర్నలిస్టులు వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..