jagityal reporter Jamir's car found in flood water
mictv telugu

రిపోర్టర్ కారు లభ్యం.. జమీర్‌ ఆచూకీపై ఉత్కంఠ

July 14, 2022

 

రెండు రోజుల క్రితం వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన తెలుగు రిపోర్టర్ జమీర్ ప్రయాణించిన కారు గురువారం బయటపడింది. దీంతో కారును బయటకు తీయించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో జమీర్ ఉన్నాడా? లేడా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, జగిత్యాలకు చెందిన జమీర్.. గోదావరి నదిలో చిక్కుకుపోయిన 9 మంది కూలీలను తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా న్యూస్ కవరేజీ కోసం వెళ్లాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు రామోజీ పేట వాగు మీదుగా ప్రయాణిస్తుండగా, వరద ధాటికి కారుతో సహా జమీర్ కొట్టుకుపోయాడు. దీంతో విషయం తెలిసి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించినా వర్షం, వరదలతో దానిని కంటిన్యూ చేయలేకపోయారు. బుధవారం రాత్రి నుంచి వరద కొంత తగ్గుముఖం పట్టడంతో కారు టైర్లు పైకి తేలాయి.