ఒకే సారి మూడు ఉద్యోగాలు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే సారి మూడు ఉద్యోగాలు..!

September 8, 2017

ఒక్కోసారి అదృష్టం ఎట్లా వరిస్తుందంటే…చెప్పినా  నమ్మలేనంత. ఇంకా చెప్పాలంటే ఓరీ దేవుడో అనేలా ఉంటుంది.  ఉద్యోగం దొరకడం ఈరోజుల్లో గగనం అందులో గవర్నమెంట్ జాబ్ రావాలంటే కిస్మత్ ఉండాలే అంటరు. అయితే  జగిత్యాలకు సమీపంలోని రాయికల్ గ్రామానికి చెందిన దివ్య భారతి అనే అమ్మాయికి ఒకే సారి మూడు గవర్నమెంట్ ఉద్యోగాలొచ్చాయి. మొదట ఆమె సివిల్ కానిస్టేబుల్ కోసం పరీక్ష రాసింది, ఎంపికైంది. ఆ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ కోసం రాసింది ఎంపికైంది.  ఎస్సై పరీక్ష  కూడా రాసింది. దాంట్లోనూ పాస్ అయింది. ఆమె  ఫైనల్ గా ఎస్పై కోచింగ్ తీసుకోవడానికి  రెఢీ అవుతున్నదని ఆమె పేరెంట్స్  గణేష్, లక్ష్మీ అంటున్నారు. దివ్య భారతి తండ్రి బీడీ కమీషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. లక్కు అంటే దివ్వభారతిదే కదా…. కాదు కాదు ప్లాన్ ప్రకారం….కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందనే దానికి ఉదాహరణ ఈమెనే కదా.