‘చించావ్ పో’ రష్మికపై జగిత్యాల కలెక్టర్ వివాదస్పద ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘చించావ్ పో’ రష్మికపై జగిత్యాల కలెక్టర్ వివాదస్పద ట్వీట్

February 20, 2020

Jagtial Collector Comments On Rashmika Photos

సినిమా హీరోలు, హీరోయిన్లు ఏదైనా ఫొటో పోస్ట్ చేస్తే దానిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తారు. ఇక హీరోయిన్లకు అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక పెట్టిన ఫొటోలపై కూడా తెగ కామెంట్లు వచ్చిపడ్డాయి. అయితే దీంట్లో ఒక కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘చించావ్ పో రష్మిక’ అంటూ కామెంట్ పెట్టారు.అది పెట్టింది మరెవరో కాదు జగిత్యాల జిల్లా కలెక్టర్ కావడంతో ఇది వివాదస్పదమైంది

రష్మిక పెట్టిన ఫొటో కింద కలెక్టర్  అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన కామెంట్ చూసి అంతా షాక్ అయ్యారు. దాన్ని చూసిన వారు కలెక్టర్ ఇలాంటి కామెంట్ చేశారేంటి అని ప్రశ్నించుకున్నారు. 

ఇది కాస్తా వైరల్‌గా మారి వివాదం మొదలైంది. దీనిపై కలెక్టర్ రవి వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. ఆ కామెంట్ తాను చేసింది కాదని, ఎవరో ఆ ఖాతాను హ్యాక్ చేశారని చెప్పారు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.