కరోనా ఫైన్.. బయటకు వచ్చాడని రూ. 500 జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఫైన్.. బయటకు వచ్చాడని రూ. 500 జరిమానా

March 31, 2020

Jagtial Village Fined Rs 500 for Violation of Lockdown

కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చారంటే పోలీసుల లాఠీలకు పని చెబుతున్నారు. అయినప్పటికీ కొంత మంది నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ బయట తిరిగే వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. ఇలా జరిమాన విధించిన ఓ దృవపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

రాయికల్ మండల్ ఇటిక్యాల గ్రామంలో ఇలా రాష్ట్రంలోనే తొలిసారి ఓ గ్రామ పంచాయతీ ఫైన్ విధించింది. మిట్టపెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి జరిమానా విధించారు. ఒకేరోజు మూడుసార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంలో రూ. 500 రూపాయలను వసూలు చేశారు. దీనికి సంబంధించిన రసీదును కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే లాక్‌డౌన్ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారి సంఖ్య కట్టడి చేసేందుకు గ్రామ పంచాయతీలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి.