ఇద్దరు గేలు ఒక్కటయ్యారు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు గేలు ఒక్కటయ్యారు !

July 12, 2017

ఎవరికి నచ్చిన లైఫును వాళ్ళు లీడ్ చెయ్యటంలో తప్పేం లేదంటున్నారు ఈ ఇద్దరు జాహెద్ చౌదరి, సీన్ రోగన్ అనబడే ఈ ఇద్దరు గేలు. బంగ్లాదేశ్ వస్త్రాధరణలో వివాహం చేస్కున్నారు. అప్పటికి కొందరు మతవాదుల నుండి తనకు బెదిరింపులు వచ్చినా తను పట్టించుకోకుండా పెళ్ళి చేస్కున్నట్టు తెలిపారు. స్పెయిన్ ను హనీమూన్ స్పాట్ గా ఎంచుకున్నట్టు చాలా హ్యాప్పీగా చెప్పుకున్నారు. సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకొని మాకు నచ్చని, మా శరీరం సహకరించని బతుకును ఎలా బతకాలని కూడా ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. బ్రిటన్ లో ఒక సందర్భంలో సీన్ రోగన్ బెంచీ మీద ఏడుస్తూ కూర్చున్నప్పుడు అక్కడికెళ్ళిన జాహెద్ తో ఒకరికొకరికి పరిచయం ఏర్పిడింది. అదికాస్తా స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసింది. అలా మనసారా ప్రేమించుకున్న వీళ్ళ పెళ్ళికి ఇస్లాం సంప్రదాయం అడ్డుపడింది. అలా చెయ్యటం హరామ్ అని కొందరు విమర్శలకు దిగారు. కానీ జాహెద్ మనసు ఎంతకీ ఆ మతానికి లోబడలేక పోయింది.

తననిలా పుట్టించినందుకు నేను కనపడని దైవాన్ని అడగలేను, అలాగని సాంప్రదాయ ఉచ్చులో పడి నాకు నచ్చని జీవితాన్ని జీవించలేను. నా తలరాత ఇంతేనని తల బాదుకొంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చేలేనని జాహెద్ మత పెద్దలను ఎదురించి ఈ నిర్ణయాన్ని తీస్కున్నాడు. ఒక మనిషి శారీరక లోపంతో పుడితే అదే శాపంగా బతక నేర్పడమే సంప్రదాయం ఉద్దేశం అయితే నేనందుకు మినహాయింపునంటాడు జాహెద్ చౌదరి. లోపాల్లోంచి ఆనందాన్ని వెతుక్కొని బతికినన్ని రోజులు హాయిగా బతికితే మతం ఒప్పుకోదా ? మనిషి ఆనందాన్ని కోరుకోని మతమెందుకని చాలా ఆవేదనగా మాట్లాడ్తున్నారు వాళ్ళు !

http://www.dailymail.co.uk/news/article-4684824/Groom-UK-Muslim-sex-marriage.html