జై భీమ్ వివాదం... సూర్య, జ్యోతికలపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

జై భీమ్ వివాదం… సూర్య, జ్యోతికలపై కేసు

May 5, 2022

 

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం జైభీమ్. ఆస్కార్స్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నామినేట్ అయిన ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వ‌చ్చాయి. ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అవార్డ్స్‌-2022లోనూ రెండు విభాగాల్లో పుర‌స్కారాలు ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు త‌మ సామాజిక వర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయిని వన్నియార్ కులానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించారు. త‌మ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా ఆ స‌న్నివేశాలు ఉన్నాయని వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్… హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్‌ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 29, 2022 న విచారణకు రాగా… ఇప్పటి వ‌ర‌కూ వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గురువారం కోర్టు.. సూర్య దంప‌తుల‌తో పాటు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు మే 20న మళ్లీ విచారణకు రానుంది.