హాజరు తీసుకుంటున్నప్పుడు జైహింద్ అనాలట..! - MicTv.in - Telugu News
mictv telugu

హాజరు తీసుకుంటున్నప్పుడు జైహింద్ అనాలట..!

September 13, 2017

స్కూల్లో టీచర్లు హాజరు తీస్కున్నప్పుడు  మామూలుగా పిల్లలు ఏమంటారు. ప్రజెంట్ మేడం,ప్రజెంట్ సార్ ,లేక ఎస్ టీచర్, అని అంటారు కదా…కనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని సాత్నా జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విచిత్రమైన నిబంధన పెట్టారు. టీచర్లు హాజరు తీస్కున్నప్పడు  ఎస్ మేడం ,ఎస్ సార్ కు బదులుగా జైహింద్ అని అనాలట.

అలా ఎందుకంటే దీనివల్ల పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని  ఆ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అక్కడి సీయం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అనుమతితో మధ్య ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేసేలా చూస్తామని చెబుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లగానే దేశభక్తి గీతాలు ఎలాగో పాడతారు. కొత్తగా ఈ జైహింద్ నినాదం అనే ఆలోచన బాగుందని  చాలామంది  హర్షం వ్యక్తం చేస్తున్నారు.