జై లవకుశ పై అంత మాట అన్నారా... - MicTv.in - Telugu News
mictv telugu

జై లవకుశ పై అంత మాట అన్నారా…

September 13, 2017

జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవకుశ గురించి రోజూ ఎవరో ఒకరు ఏదో కామెంట్ చేస్తూనే ఉన్నారు. జై లవకుశ సిన్మా ట్రైలర్ రిలీజ్ నుండి కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.  తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు కూడా కామెంట్  చేశారనే ప్రచారం జరుగుతున్నది. అయితే  ఈ సిన్మా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 21న విడుదల అవుతున్నది. యంగ్  టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సిన్మా గురించి వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సిన్మాలో జూనియర్ ఎన్టీఆర్ త్రీపాత్రాభినయం చేశారు. మొదటి  సారిగా మూడు రూపాల్లో  రామారావు  కన్పిస్తుండటంతో అభిమానులూ అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సిన్మా గురించి సెన్సార్ బోర్డు సభ్యులు ఉమైర్ సంధు మాంచి  కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరో   బ్లాక్ బస్టర్ మూవీ ఎన్టీఆర్ ఖాతాలో పడ్డట్లేనని  అన్నారని టాక్. మాస్ ఎంటర్ టైనర్ గా మంచి టాక్ తెచ్చుకోవడం ఖాయమని అన్నారట. అయితే ఈ మూవీ గురించి ముందస్తుగానే  రివ్యూలు వస్తున్నాయి. రామారావు కూడా మాంచి హిట్  కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి….. రామారావు త్రీపాత్రిభినయం ఎట్లా ఉంటుందో. ఇప్పటికైతే  పాజీటీవ్ వేవ్స్  ఉన్నాయి మరి.