జై లవకుశ ట్రైలర్ సూపర్.... - MicTv.in - Telugu News
mictv telugu

జై లవకుశ ట్రైలర్ సూపర్….

September 11, 2017

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో జనాలను  ఆకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆయన నటించి జై లవకుశ సిన్మా ట్రైలర్ అంత కంటే జనాలను మస్తు ఇంప్రెస్ చేస్తున్నది. రెండు నిమిషాలకు పైగా ఉన్న  ట్రైలర్  లో ఎన్టీర్ చెప్పిన డైలాగులకు  మంచిప్రయార్టీ ఇచ్చారు. అంతేకాదు  హీరోయిన్ల క్యూట్ డైలాగులు పెట్టారు.  ఈసిన్మాలో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఎవ్వరైనా సూపర్  అనాల్సిందే. ‘ ఏ తల్లికైనా  ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామ,లక్ష్మణ ,భరత లవ్వాలని కోరుకుంటుంది. దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ,లక్ష్మణులయ్యారు.’  ఈ తరహా డైలాగులున్నాయి.

ఈ సిన్మా జూనియర్ కు మంచి పేరు తెస్తుందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.  రామారావు ఈ మూవీలో కొత్త గెటప్ లో కన్పిస్తున్నారు. సిన్మాపై మంచి అంచనాలున్నాయి. సాటి  నటులు కూడా ట్రైలర్ ను చూసి సూపర్ బాసూ అంటున్నారు.