జైలవకుశ కు 76 లక్షల వ్యూలు - MicTv.in - Telugu News
mictv telugu

జైలవకుశ కు 76 లక్షల వ్యూలు

September 12, 2017

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ మూవీ ట్రైలర్ ఆదివారం విడుదలైంది.  ‘ఘట్టమేదైనా పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ఎన్టీఆర్  డైలాగ్ తో అదరగొట్టారు . ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది.  టాలీవుడ్  లోనే ఇంత వ్యూస్ దక్కించుకున్న రెండో  ట్రైలర్  ఇదేనట. మెుదటి ట్రైలర్ ‘బాహుబలి1′. మూవీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్వీటర్ ద్వారా’ బాహుబలి’ ట్రైలర్  తర్వాత’ జై లవకుశ’ ట్రైలర్ కే అధిక వ్యూస్ వచ్చాయని తెలిపాడు.

 

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘జై లవకుశ’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే నా నటనతో మీ అందరూ తృప్తి చెందే విధంగా కష్టపడతా’ అని అన్నారు. ఈ  మూవీని ఎన్టీఆర్  ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్.. బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని చాలా మంది సినీ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. ప్రత్యేకించి జై పాత్ర బాగుందని చెప్పారు.