బీజేపీ అన్నా, హిందుత్వ రాజకీయాలు అన్నా మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో జలక్ ఇచ్చారు. పక్కనే ఉన్న జనంలో కొందరు జై శ్రీరామ్ అని పెద్దపెట్టున నినాదాలు చేయడంతో కోపంతో, అలకతో వేదిక ఎక్కడానికి నిరాకరించారు.
కుర్చీలో కూర్చుండిపోయారు. కోల్కతాలో శుక్రవారం వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రాంరంభ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హౌరా-న్యూ జల్పాయ్గురి మధ్య నడిచే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. హౌరాలో మమత ఈ రైలును మమత ప్రారంభించాల్సి ఉంది. అయితే రైల్వేస్టేషన్లో హిందూ సంఘాల కార్యకర్తలు ‘జైశ్రీరామ్’ అని బిగ్గరగా నినదించారు. మమత తీవర అసహనానికి గురై వేదిక ఎక్కడానికి నిరాకరించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.