కిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉగ్రవాద నిరోధక కోర్టు గురువారం ఇద్దరికి జైలు శిక్ష విధించింది. హత్య సమయంలో రావల్పిండి పోలీస్ కమిషనర్గా పనిచేసిన సౌద్ అజీజ్, రావల్పిండి ఎస్పీ ఖుర్రం షాజాద్కు చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను రూ. రూ.5 లక్షల జరిమానాను విధించింది. మరో నిందితుడు, దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ ప్రస్తుతం పరారీలో(లండన్)లో ఉన్నాడని కోర్టు ప్రకటించింది. కేసులో అనుమానితులుగా ఉన్న మరో ఐదుగురికి కోర్టు నిర్దోషులుగా తేల్చి వదలిలేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బేనజీర్ భుట్టో 2007లో ఓ బహిరంగ సభ వద్ద జరిగిన బాంబు దాడిలో చనిపోయారు. తర్వాత ఆమె భర్త జర్దారీ తర్వాత ప్రధాని అయ్యారు.