ప్రీవెడ్డింగ్ షూట్ చేస్తే సంఘ బహిష్కరణే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రీవెడ్డింగ్ షూట్ చేస్తే సంఘ బహిష్కరణే..

December 10, 2019

Jain,Gujarati Organisations Ban On Pre Wedding Shoot  

ఉత్తరాదిలో పెళ్లింట సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తమకు ఇష్టమైన పాటలతో స్టెప్పులు వేస్తూ మహిళలు,పురుషులు అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసే ప్రీ వెడ్డింగ్ షూట్లపై గుజరాతీ, మధ్యప్రదేశ్ జైన్ సేవా సమాజ్ నిషేదం విధించింది. తమ ఆదేశాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని సంఘం నుంచి బహిష్కరిస్తామని భోపాల్ గుజరాత్ సేవా సమాజ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. దీనిపై ఓ సర్కులర్ కూడా జారీ చేశారు. త

సంగీత్‌ కోసం మహిళలకు మగ డ్యాన్సర్లతో శిక్షణ ఇప్పించడాన్ని తప్పుబట్టారు. ఇది తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దమని పేర్కొన్నారు. ప్రీ వెడ్డింగ్ పేరుతో ఫొటోలు, వీడియోలతో డ్యాన్స్ చేయరాదని సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గుజరాతీ,జైనులు అంతా వీటిని పాటించాలని ఆయన ఆదేశించారు. తమ ఆదేశాలు తప్పుబట్టినా, వ్యతిరేకించినా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. అయితే ఇలా తమ వ్యక్తిగత విషయాలపై నిషేదం విధించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది మాత్రం దీన్ని స్వాగతించడం విశేషం.