ఐసీసీలో జైశాకు కీలక పదవి.. చేతిలో వేలకోట్ల లావాదేవీలు - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీసీలో జైశాకు కీలక పదవి.. చేతిలో వేలకోట్ల లావాదేవీలు

November 12, 2022

ఐసీసీలో భారత్‌కు కీలక పదవి దక్కింది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైశా.. అత్యంత కీలకమైన ఆర్ధిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చైర్మెన్‌‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి చేతిలో వేల కోట్ల లావాదేవీలు ఉండడం గమనార్హం. గతంలో ఈ బాధ్యతను ఆనవాయితీగా ఐసీసీ ఛైర్మెనే చూసేవారు. కానీ, ఇప్పుడు దానిని సెపరేట్ చేసి జైశాకు అప్పగించారు. దీంతో ఐసీసీలో బీసీసీఐకి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. సభ్యదేశాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్దేశించే సామర్ధ్యం ఈ కమిటీ సొంతం.

ఏడాది పొడవునా వివిధ సిరీస్‌ల సందర్భంగా ఐసీసీ కుదుర్చుకునే ఒప్పందాలు, స్పాన్సర్‌‌షిప్ కాంట్రాక్టులను పర్యవేక్షిస్తుంది. ఐసీసీ చైర్మెన్‌‌గా ఇప్పటివరకు ఉన్న గ్రెగ్ బార్క్లే మళ్లీ ఎన్నికయ్యారు. ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందిన ఈయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఈ పదవి కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డ చైర్మెన్ డాక్టర్ తవెంగ్వా ముకుహ్లాని పోటీపడగా, చివరి నిమిషంలో విరమించుకోవడంతో గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.