దేశాధ్యక్షుడికీ తప్పని వరద ముప్పు..  - MicTv.in - Telugu News
mictv telugu

దేశాధ్యక్షుడికీ తప్పని వరద ముప్పు.. 

February 26, 2020

bcbgh

ప్రకృతి ప్రకోపిస్తే ఎవరూ దాన్ని తట్టుకొని నిలబడలేరు. అలాగే ఇండోనేషియాలో కూడా భారీ వర్షాలు అందరిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసిన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. నదులన్ని ఉప్పొంగి ప్రవహిస్తూ భయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో లక్షలాది జనం రోడ్డుపాలయ్యారు. 

fbcv

ఈ వరద పోటు ఆ దేశ అధ్యక్షుడికి కూడా తప్పలేదు. ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడి బయటికి పోశారు. సోమవారం రాత్రి నుంచి నిరంతరాయంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నయి. విద్యుత్ కూడా నిలిచిపోవడం, రావాణా సదుపాయానికి ఇబ్బందిగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది.  ఇక జకర్తా నగరం పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడం అక్కడి వారిని కలవరానికి గురి చేస్తోంది.