Jale posinavemayya Folk singer kamatam Ramaswamy passed away
mictv telugu

‘జాలే పోసిన వేమయ్య’ గాయకుడు రామస్వామి కన్నుమూత

July 30, 2022

‘జాలే పోసిన వేమయ్య.. ఓ జంగమయ్య, రైకే కుట్టినవేమయ్య..’ పాటతో కోట్లాదిమంది అభిమానుల మనసు దోచుకున్న ప్రముఖ జానపద వాగ్గేయకారుడు కమటం రామస్వామి ఇక లేరు. కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం పెద్ద మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామంలోని స్వగృహంలో కన్నుమూశారు. 80 ఏళ్లకు పైగా వయసున్న రామస్వామి మరుగున పడిన వందలాది జానపదాలకు ప్రాణం పోశారు. ప్రముఖ టీవీ చానళ్లలో ఎన్నో పాటల పాడారు. ‘జాలే పోసిన వేమయ్య’ పాటల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. బ్రీత్ లెస్ పాటలతో ఆయన శ్రోతల మనసు దోచుకున్నారు. రామస్వామి మృతికి పలువురు ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు.