సంక్రాంతి పిండి వంటలు మన దగ్గర చేస్తే, ఆంధ్రాలో కోడి పందాలు జరుపుతారు. కానీ తమిళనాడులో జల్లికట్టు చేస్తారు. ఈ ఎద్దుల పోరాటం గురించిన చరిత్ర గురించి మనం
తెలుసుకోవాల్సిందే!
2017లో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే అప్పట్లో తమిళనాడులో భారీస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే చట్ట సవరణ ద్వారా జల్లికట్టుకు మళ్లీ అనుమతి లభించింది. దీనిపై సుప్రీం కోర్టులో ఇంకా విచారణ నడుస్తున్నది. తమిళనాడులో జనవరి 6వ తీదీన తమిళనాడులో మొదలుకావాల్సింది. అయితే యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదనే కారణంగా జిల్లా అధికారులు వాయిదా వేశారు. దీంతో జనవరి 8న ఈ క్రీడ మొదలైంది. అప్పుడు 22మందికి పైగా గాయపడ్డారు. అయితే పెద్ద ఎత్తున రేపటి నుంచి ఈ పండుగ జరుగబోతున్నది.
ఈ సంవత్సరం..
జల్లికట్టులో పాల్గొనే వారికి కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. గ్యాలరీల్లోని సీట్లలో 50శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని నిర్ణయించింది. అలాగే ప్రజలకు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉండాలి, వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలని చెప్పింది. అలాగే పోటీలో పాల్గొనేవారు కూడా ఈ రిపోర్టులను సమర్పించాలనే నిబంధన విధించింది. 2023లో జల్లి కట్టు మధురై జిల్లాలోని అవనియాపురంలో జనవరి 15న జరుగుతుంది. 16న పామలేడు, 17న అలంగనల్లూరులో జల్లికట్టు నిర్వహించనున్నారు. ఇందులో ఇప్పటివరకు 4500 మంది ఎద్దుల యజమానులు, 2000మంది ఎద్దులను టామర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా తుది జాబితా రావాల్సి ఉంది.
చరిత్ర.. ప్రాముఖ్యత..
రైతుల తమ స్వచ్ఛమైన జాతి, స్వదేశీ ఎద్దులను కాపాడుకోవడానికి చేసే ఆచారం ఈ జల్లికట్టు. జల్లికట్టు అనేది కల్లి (నాణేలు), కట్టు అనే పదాల కలయికతో ఏర్పడింది. పూర్తిగా చెప్పాలంటే.. ఎద్దుల కొమ్ములకు కట్టబడిన నాణేల కట్ట అని అర్థం. అంటే జంతువుల తలప నుంచి ఈ కట్టను తీయడం ద్వారా గతంలో డబ్బు లేదా వెండిని సంపాదించేవారు. 2500 సంవత్సరాలకు పురాతమైన ఆట ఇది. ఎద్దును మచ్చిక చేసుకోవడానికి ఈ ఆట మొదలైంది.
జల్లికట్టులో ఉపయోగించే ప్రసిద్ధ దేశీయ ఆవు రకాల్లో.. ఉంబలచేరి, బర్గూర్, పులికులం, కంగాయం, మలై మాడు ఉన్నాయి. ఈ జంతువుల అసాధారణ పెంపకందారుల పట్టం కడుతారు. జల్లికట్టు 400 నుంచి 100 బీసీ వరకు కొనసాగిందని నాటి గుహల్లో కనిపించిన చిత్రాలే ఇందుకు సాక్ష్యం. తమిళ శాస్త్రీయ ఇతిహాసాల్లో జల్లికట్టును ప్రజలు వీక్షించడం, పాల్గొనడంపై ప్రస్తావనలు ఉన్నాయి. పిడితాల్ పొల్లేరుడు, పిడితాల్ మడు, యెరుతాఝువుతాల్ జల్లికట్టుకు ఉన్న ఇతర పేర్లు.