Jallikattu started in Tamil Nadu
mictv telugu

జల్లికట్టు ప్రారంభమైన మొదటి రోజే 20 మందికి గాయాలు

January 8, 2023

Jallikattu started in Tamil Nadu

సంక్రాంతి వస్తుందంటే చాలు తమిళనాడులో జల్లికట్టు సంబరాలు గుర్తుకువస్తాయి. పరిగెడుతున్న ఎద్దును లొంగదీసుకోడానికి యువకులు పోటీపడుతుంటారు. ఈ సారి కూడా ఎప్పటిలాగే జల్లికట్టు ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధికారకంగా పర్మిషన్ ఇవ్వడంతో పుదుకోట్టైలోని తచంకురిచిలో ఆదివారం ఉదయం జల్లికట్టు పోటీలు షుురూ అయ్యాయి. తమిళనాడు మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ఈ పోటీలను ప్రారంభించారు. అయితే జల్లికట్టు పోటీలు ప్రారంభంలోనే రక్తం చిందింది మొదటి రోజే 20 మంది వరకు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాట సంక్రాంతి సంబరాలు, సంస్కృతిలో జల్లికట్టుదే అగ్రస్థానం. నిజానికి ఏడాది ప్రారంభంలోనే జల్లికట్టు ప్రారంభ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అనుమతులు రాకపోవడంతో ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదు. చివరికి శనివారం(జనవరి 7) జల్లికట్టుకు స్టాలిన్ సర్కార్ షరుతులతో కూడిన అనుమతులిచ్చింది. మూడు వందల మందికి మించి ప్రేక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ సాంప్రదాయ జల్లి కట్టుని తమిళనాడుతో పాటు.. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కనుమ పండుగ నాడు నిర్వహిస్తారు.