అమెజాన్ ప్రైమ్‌లో జేమ్స్ బాండ్ సినిమాలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ప్రైమ్‌లో జేమ్స్ బాండ్ సినిమాలు

March 18, 2022

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ కొనుగోలు చేసింది. ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియో ఎంజీఎం స్టూడియోస్‌ను కొనుగోలు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇందుకు గాను రూ. 64 వేల కోట్ల రూపాయల డీల్ కుదిరినట్టు ప్రకటించింది. ఈ ఒప్పందానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇక ఎంజీఎం స్టూడియోస్‌కు ఉన్న కంటెంట్ అంతా ప్రైమ్ సొంతమైనట్టే. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన జేమ్స్ బాండ్ సిరీస్ కూడా అందులో ఉంది. ఈ నేపథ్యంలో బాండ్ సిరీస్‌ల సినిమాలు ఇకపై ప్రైమ్‌లో చూడొచ్చు. అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో పోటీలో ఉన్న మిగతా కంపెనీల మీద అమెజాన్ ప్రైమ్ పై చేయి సాధించినట్టయిందని విశ్లేషకుల భావన.