చాప్టర్ క్లోజ్.. జేమ్స్ బాండ్ కన్నుమూత..  - MicTv.in - Telugu News
mictv telugu

చాప్టర్ క్లోజ్.. జేమ్స్ బాండ్ కన్నుమూత.. 

October 31, 2020

James bond Sean Connery Hollywood  actor .jp

తెలుగులో గూఢచారి చిత్రాలకు, అపరాధ పరిశోధక నవలలకు స్ఫూర్తిని హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాల హీరో సీన్ కానరీ ఇక లేరు. 90 ఏళ్ల కానరీ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నిద్రలోని చనిపోయాడు. 1962లో విడుదలైన ‘డాక్టర్ నో’లో కానరీ తొలిసారి జేమ్స్ బండ్ గా కనిపించాడు. ‘మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్‌.’ అని పంచ్‌లు విసురుతూ కళ్లను తనవైపు తిప్పుకున్నాడు. అతని చలకీతనానికి, కోపానికి, తన్నులకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఏకంగా ఆస్కార్‌తోపాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.  

జేమ్స్ బాండ్ చిత్రాల్లో కానరీని తప్ప మరొకర్ని చూడ్డానికి జనం ఇష్టపడేవారు కాందంటే ఆయనపై ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్’,  ‘గోల్డ్‌ఫింగర్’, ‘థడర్‌ బాల్’, ‘యూ ఓన్లీ లివ్‌ ట్వైస్’, ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ తదితర చిత్రాల్లో కానరీ బాక్సాఫీసులను కొల్లగొట్టాడు. వయసు పైబడ్డంతో తర్వాత బాండ్ పాత్రల నుంచి తప్పుకున్నాడు. స్కాట్లాండ్‌లో జన్మించిన ఆయన మొదట చిన్నాచితకా వేషాలు వేసేవాడు. జేమ్స్ బాండ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.