James Cameron Deploys Avatar Remaster to Lure Us Back to the Cinema
mictv telugu

‘అవతార్-1’ మళ్లీ వస్తోంది.. 4k హై డైనమిక్‌ రేంజ్‌లో

September 20, 2022

ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ తన ‘అవతార్’ సినిమాకు టెక్నికల్ గా మరిన్ని సొబగులు అద్ది సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే! 2009 డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అవతార్’ సినిమా నిర్మాణ వ్యయం అప్పట్లో 237 మిలియన్లు అంటే పదమూడు సంవత్సరాల క్రితం మన కరెన్సీలో దాదాపు ఆరు వందల కోట్లు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు.

4కె అండ్ హై డైనమిక్ రేంజ్ , 48 ఫ్రేమ్స్ పర్ సెకండ్ టెక్నిక్ తో ‘అవతార్’ ను రీమాస్టర్ చేసినట్లు జేమ్స్‌ కామెరూన్‌ తెలిపారు. దీని కోసం ఇప్పుడు 9 మిలియన్ డాలర్లు వెచ్చించారన్నారు. మన కరెన్సీలో దాదాపు రూ.71.5 కోట్లు. “అప్పట్లో ‘అవతార్‌’ని త్రీడీలో చూసి ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇప్పుడు దీన్ని 4కే ఫార్మాట్‌లోకి మార్చి హై డైనమిక్‌ రేంజ్‌లో తీర్చిదిద్దాం. అంతేకాదు, 9.1సౌండ్‌తో సెప్టెంబరు 23న మీ ముందుకు తీసుకొస్తున్నాం” అని అన్నారు కామెరూన్. ‘అవతార్‌’ సిరీస్‌లో వస్తోన్న రెండో చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ డిసెంబరులో రానుంది. తొలి భాగంలో నటించిన సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్డానాలతో పాటు, ఇందులో కేట్‌ విన్సెలెట్‌ కూడా నటిస్తోంది.