James Cameron watches ‘RRR’ twice, SS Rajamouli says, “I am on TOP of the world”
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రశంసించిన ‘అవతార్’ డైరెక్టర్

January 16, 2023

James Cameron watches ‘RRR’ twice, SS Rajamouli says, “I am on TOP of the world”

దర్శక ధీరుడు రాజమౌళి తీసిన RRR సినిమా.. ప్రపంచమంతటా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, అవార్డులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్‌లో ఈ సినిమాని, రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR సినిమాని ప్రమోట్ చేస్తూ ఆస్కార్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవలే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గెలుచుకున్నారు. తాజాగా బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా వరించింది.

ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుపై కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ఆశలు పెంచుకుంది. ఇదే క్రమంలో తమ టీమ్‌ను ప్రమోషన్ చేసుకుంటున్నారు రాజమౌళి. వివిధ అవార్డు ఫంక్షన్స్ లో హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్స్ ని కలుస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పిల్ బర్గ్ ని కలిశారు. ఆయన్ని కలిసిన రాజమౌళి ఆ ఫోటోని షేర్ చేస్తూ నా దేవుడ్ని కలిశారని పోస్ట్ చేశారు. స్టీవెన్ స్పిల్ బర్గ్ కి RRR సినిమా, నాటు నాటు సాంగ్ నచ్చాయని చెప్పారన్నారు. దీంతో వీరిద్దరి ఫోటో వైరల్ గా మారింది.

తాజాగా ప్రపంచంలో మరో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని రాజమౌళి కలిశారు. టైటానికి, అవతార్ లాంటి సినిమాల దర్శకుడిని రాజమౌళి కలవడమే కాదు ఆయన RRR సినిమా నచ్చిందని, తన భార్యకి కూడా చూడమని సజెస్ట్ చేశానని చెప్పడం విశేషం. జేమ్స్ కామెరూన్ తో ఉన్న ఫోటోని రాజమౌళి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. “ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు. నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్(జేమ్స్ కామెరూన్). మీ ఇద్దరికి ధన్యవాదాలు. నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ ” అని జక్కన్న పేర్కొన్నారు. ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “ది గ్రేట్స్ జేమ్స్ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్పై ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్ట్మెంట్గా ఉంది” అని ట్వీట్ చేశారు.