సెక్స్‌టాయ్‌తో భారతీయుణ్ని చంపేసిన భామకు 9 ఏళ్ల జైలు  - MicTv.in - Telugu News
mictv telugu

సెక్స్‌టాయ్‌తో భారతీయుణ్ని చంపేసిన భామకు 9 ఏళ్ల జైలు 

October 22, 2020

Jamie Lee Dolheguy jailed for manslaughter of man she met on Plenty of Fish dating app.jp

ప్రియుడి నుంచి అతి శృంగారాన్ని కోరుకుంది. అయితే ఆమె ఆశించిన సుఖం అతను అందించలేకపోయాడు. దీంతో కామాగ్నితో రగిలిపోయిన సదరు భామ అతణ్ని అన్యాయంగా చంపేసింది. సెక్స్ టాయ్స్‌కు వినియోగించే కేబుల్‌ను అతని మెడకు బిగించి హత్యచేసింది. 2018లో జరిగిన ఈ ఘటనపై లోతుగా విచారించిన కోర్టు ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. జెమీలీ డోలెగై (21) అనే యువతి ప్లెంటీ ఆఫ్ ఫిష్ అనే డేటింగ్ యాప్‌లో ఓ భారతీయ యువకుడి(24)తో పరిచయం పెంచుకుంది. వారిద్దరూ కలిసి ఓరోజు సన్బరీలోని యువతి ఇంట్లో శృంగారంలో పాల్గొన్నారు. అతనితో ఆమె విపరీత సెక్సును ఆశించింది. ఆమె కోరికను అతను తీర్చలేకపోయాడు. శృంగారాన్ని పైపైగా కానిచ్చాడు. దీంతో తనను సెక్స్‌లో సంతృప్తి పరచలేకపోయాడని అతడిపై రగిలిపోయిందామె. తనను సంతృప్తి పరచని మగాడు బతకడానికి వీల్లేదని భావించింది. అంతే సెక్స్ టాయ్‌కు వినియోగించే కేబుల్‌‌ను అతని గొంతుకు బిగించి చంపేసింది. అయితే అతడు రావడానికి ముందే ఆమె యువకుడిని చంపడానికి ప్లాన్ చేసింది. ‘ఈ రోజు నేను ఒకరిని సరదా కోసం చంపబోతున్నా’ అని ఆమె చేసిన చాటింగ్ వెలుగు చూసింది. యువకుడితో సెక్స్‌లో పాల్గొని, అనంతరం అతడిని చంపేశాక జెమీ లీ పోలీసులకు ఫోన్ చేసి తాను హత్య చేసినట్టు చెప్పింది. 

పోలీసులు వచ్చి చూసేసరికి అతడు చనిపోయాడు. అతడు కోరి మరీ హత్య చేయించుకున్నాడని ఆమె తొలుత పోలీసుల ముందు బుకాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో స్థానిక న్యాయస్థానం ఈ కేసును లోతుగా విచారించి జెమీ లీకి 9 సంవత్సరాల శిక్ష విధించింది. ‘నీకు ఎలాంటి హాని చేయని వ్యక్తి ప్రాణం తీశావు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, ఆమె మూడు సంవత్సరాల తర్వాత పెరోల్ మీద రిలీజ్ కావొచ్చని.. బయటికి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే ఉండి మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని కోర్టు పేర్కొంది. కాగా, జెమీలీకి మానసిక సమస్యలు కూడా ఉన్నట్టు కోర్టు గుర్తించింది. జెమిలీ యుక్త వయసులో ఉండగా తన మీద భౌతిక దాడి జరిగిందని.. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. ఇంట్లో పరిస్థితి అత్యంత భయంకరంగా ఉండడంతో ఆమెను 10 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. 14 నుంచి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇద్దరు ఫుల్ టైమ్ కేర్ టేకర్ల సమక్షంలో పెరిగింది. ఆ తర్వాత నుంచి జెమిలీ ఒంటరిగా నివసిస్తోంది.