జమ్మికుంట దేశానికే ఆదర్శం ఎందుకో తెలిస్తే షాక్ అవడం ఖాయం.... - MicTv.in - Telugu News
mictv telugu

జమ్మికుంట దేశానికే ఆదర్శం ఎందుకో తెలిస్తే షాక్ అవడం ఖాయం….

August 31, 2017

దేశభక్తి గురించి మాట్లాడటం కాదు చేతల్లో చూపించాలి.  చాలా మంది మాటలు చెప్తుంటారు. దేశ భక్తి అంటే అది ఇదీ అంటారు. వాస్తవంలోకి వచ్చే సరికల్లా గాలికి వదిలేస్తారు. కానీ తెలంగాణలోని ఓ గ్రామం  మాత్రం  దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తమ దేశభక్తిని చాటుకుంటున్నది.

పొద్దున్నే జాతీయ గీతం విన్పించగానే ఊర్లోని ప్రతి ఒక్కరూ  తమ తమ స్థానాల్లో లేచి నిలబడి జాతీయ జెండాకు వందనం చేస్తారు. ఆటోలు, బస్సులు… కార్లు… బైకులు అన్నీ ఠక్కున ఆగిపోతాయి. దేశభక్తి ఇదీ. పౌరులు అంటే వీళ్లు. దేశభక్తి అంటే బలవంతంగా నేర్పడం కాదు.  ఇదిగో ఈ గ్రామస్తులనే చూడండి.