మెహబూబా ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

మెహబూబా ముఫ్తీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

April 15, 2019

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీపై కొన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికల వేళ కావడంతో ఆమెపై దాడులకు దిగుతున్నాయి. ఆమె ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతనాగ్ జిల్లోని ఖీరం దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడి చేశారు. ఓ వాహనంలోని  డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. మెహబాబూను ఆమె భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తారు.

Jammu Kashmir former chief minister and PDP president Mehbooba Mufti's Convoy Attacked With Stones In Kashmir's Anantnag.

అయితే ఇలాంటి వాటికి తాను భయపడేదని లేదని మెహబూబా అన్నారు. దాడి తర్వాత కూడా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాడి నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్370ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెబుతుండడం, అదే జరిగితే భారత్ నుంచి కశ్మీర్ విడిపోవడం ఖాయమని మెహబాబూ హెచ్చరిస్తుండడం తెలిసిందే.