ఈడౌట్ ఎందుకచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు వెంకయ్యనాయుడుకి జరిగిన ఆత్మీయుల సమ్మేళనంలో జానారెడ్డి గారు పాల్గొన్నందుకే..అవును ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఉన్న వెంకయ్య నాయుడు ప్రచార సభకు జానారెడ్డి పోవడం..ఈ డౌట్ కు కారణం.కాంగ్రెస్ బల పరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి గోపాల కృష్ణ గాంధీ బరిలో ఉండగా జానారెడ్డి వెంకయ్యనాయుడిని పొగడ్తలలో ముంచడమే మా డౌటుకు మరో కారణం.గతంలో కూడా జానారెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడి ఇరుకున పడ్డారు.అలాగే జిహెచ్ ఎం సి ఎన్నికల్లో 5 రూపాల భోజనం మంచిగుందని,కాంగ్రెస్ ఆఫీస్ కి తెప్పించుకొని తిని మరీ పొగిడిండు,అప్పడు కూడా జానారెడ్డి సొంత పార్టీనుంచి విమర్శలను ఎదుర్కున్నడు. ఏకంగా కొన్ని పత్రికలైతే కేసీఆర్,జానారెడ్డి జాన్ జబ్బలని రాసేశ్నయ్.ఇపుడు మల్లా వెంకయ్య,జానారెడ్డి జాన్ జబ్బలు అని రాసే అవకాశం పత్రికలకు ఆయనే ఇచ్చిండు.