పొత్తుపై పవన్ స్పష్టత ఇవ్వాలి.. కవిత డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

పొత్తుపై పవన్ స్పష్టత ఇవ్వాలి.. కవిత డిమాండ్

March 15, 2019

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో కలిసి పోటీచేస్తామని జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించింది. శుక్రవారం రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటించి బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయి పొత్తు కుదుర్చుకున్నారు.

Jana sena bahujan samaj party alliance in telugu states is political gimmick says nizamabad mp kavitha.

ఈ నేపథ్యంలో జనసేన-బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ-జనసేన పొత్తు పెట్టుకోవడం రాజకీయ గిమ్మిక్కేనని ఆమె స్పష్టం చేశారు. వీరిద్దరూ ఏపీలో చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళతారా? లేక స్వతంత్రంగా పోటీచేస్తారా? అనే విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, మాయావతి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.