జనసేనాని పెద్ద మనసు..అమరుల కుటుంబాలకు రూ.కోటి విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనాని పెద్ద మనసు..అమరుల కుటుంబాలకు రూ.కోటి విరాళం

February 19, 2020

jana sena supremo pawan kalyan delhi tour

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డు ఆఫీస్‌ను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి చెక్కును సైనికాధికారులకు అందచేస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్‌ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అలాగే గురువారం మధ్యాహ్నం విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పవన్ గురించి రూపొందించిన షార్ట్‌ ఫిలింను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి మేఘాలయ రాష్ట్ర స్పీకర్‌ మెత్చా లింగ్లో అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సదస్సులో పాల్గొనున్నారు.