రైతులకు అండగా.. అమరావతిలో పవన్ పర్యటన - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు అండగా.. అమరావతిలో పవన్ పర్యటన

August 30, 2019

ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్‌ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు

2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. రాజధాని మార్పుపై పార్టీ విధానాన్ని ప్రకటించనున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు పవన్‌ను కలిసి రాజధాని తరలించకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన పవన్.. అండగా ఉంటానని మాటిచ్చారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని పవన్ హామీనిచ్చారు. 

ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇలా ఉండబోతుంది. నిడమర్లు, కురగల్లు, ఐనవోలు, కొండవీటివాగు బ్రిడ్జీ, ఎస్.ఆర్.ఎం యూనవర్సిటీ పరిశీలన, శాఖమూరు, విట్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ బిల్డింగ్స్, శిల్పారామం, అంబేద్కర్ స్మృతివనం, రిజర్వాయర్ పరిశీలన, ఎన్జీవో క్వార్టర్స్ విజిట్, హైకోర్టు, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ ప్రదేశాల పరిశీలన, సచివాలయ భవనాల నిర్మాణ స్థలం పరిశీలన, న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ ప్రదేశం, ఐఏఎస్, ఎమ్మెల్యే నివాసం టవర్స్, అనంతవరం గ్రామం, ఎన్ 17 రోడ్, అనంతవరం ఎస్ 16 రోడ్, దొండపాడు, సీడ్ యాక్సిస్ రోడ్, సీఆర్డీఏ బిల్డింగ్స్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలన.