'Janaganamana'..forget about it: Vijay Deverakonda
mictv telugu

‘జనగణమన’..దాని గురించి మర్చిపోండి: విజయ్ దేవరకొండ

September 13, 2022

”ఇక్కడికి ప్రతీ ఒక్కరు వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి ‘జనగణమన’ గురించి ఇక్కడ మర్చిపోండి. ప్రస్తుతం సైమాను ఎంజాయ్ చేయండి” అంటూ టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో ఇటు విజయ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ‘జనగణమన’ సినిమా ఆగిపోయిందా? పూరీ జగన్నాథ్‌‌తో మళ్లీ సినిమా చేయడానికి విజయ్ ఆలోచిస్తున్నాడా? అంటూ తెగ చర్చలు జరుగుతున్నాయి.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీల కలయికలో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా ఆగస్టు 25న ‘లైగర్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాపై హీరో విజయ్, ఆయన అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, ‘లైగర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలో ‘లైగర్’ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండతో తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’ ప్రారంభిస్తున్నట్లు దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రకటించారు.

అంతేకాదు, ‘జనగణమన’కు సంబంధించి, చిన్న షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దర్శక, నిర్మాతలు ‘జనగణమన’పై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో ‘జనగణమన’ సినిమా ఆగిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ, ఇప్పటివరకూ ఆ వార్తలపై పూరీ జగన్నాథ్ గానీ, ఛార్మీ గానీ, విజయ్ గానీ స్పందించలేదు.

తాజాగా జరిగిన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న విజయ్‌ని..అక్కడి మీడియా ప్రతినిధులు ‘జనగణమన’ గురించి ప్రశ్నించారు. దానికి విజయ్ సమాధానం చెప్తూ..’ఇక్కడికి ప్రతీ ఒక్కరు వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోండి. సైమాను ఎంజాయ్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు.