జానకమ్మ ఆఖరి పాటేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

జానకమ్మ ఆఖరి పాటేసింది..

October 30, 2017

గానకోకిల ఎస్. జానకి  గానానికి ముగింపు పలికారు. తన స్వరయాత్రను ప్రారంభించిన మైసూరులో శనివారం చివరి పాట పాడి 65 ఏళ్ల గానానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఓ స్వచ్ఛంద కార్యక్రమానికి నిధుల సేకరణ కోసం ఆమె ఈ కచేరీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. 1925లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆమె సంగీతం ప్రారంభించారు. పి.బి.శ్రీనివాస్‌తో పాడారు. తర్వాత ఇక వెనక్కి చూడలేదు. దక్షిణాది సినిమాల్లో దూసుకుపోయారు. 1957లో తమిళ మూవీ ‘విదియున్ విళయాట్టు’తో నేపథ్య గాయనిగా మారారు. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ‘పగలే వెన్నెల ..’ అంటూ సన్నని కంఠంతో సాగే ఆమె పాటలు శ్రోతలను మేఘాల్లో తేలిపోయేలా చేశాయి. ఆమె 4 సార్లు జాతీయ పురస్కారాన్ని, 31 సార్లు కలైమామణి, నంది వంటి వివిధ రాష్ట్రాల పురస్కారాలను పొందారు. చేసిన సంగతి తెలిసిందే.