Janarthan get well soon.. we will meet: NTR
mictv telugu

జనార్థన్ త్వరగా కోలుకుని రా.. మనం కలుద్ధాం: ఎన్టీఆర్

June 30, 2022

”జనార్థన్ నువ్వు త్వరగా కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం. జనార్దన్‌కు ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. అందరం కలిసి దేవుడిని ప్రార్ధిద్దాం. మీకూ, మీ అబ్బాయికి నేనున్నా” అంటూ టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. తాజాగా ఎన్టీఆర్ వీరభిమాని జనార్థన్ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై, కోమాలోకి వెళ్లాడు. దాంతో జనార్థన్ తల్లి తన కొడుకు పరిస్థితిపై ఆందోళన చెందుతుండగా కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనార్థన్ పరిస్థితిని ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి వివరించారు.

ఈ క్రమంలో వెంటనే స్పందించిన ఎన్టీఆర్.. జనార్ధన్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. “జనార్ధన్ నేను ఎన్టీఆర్‌ని మాట్లాడుతున్నా, నువ్వు త్వరగా కోలుకుని రా. మనం త్వరలోనే కలుద్దాం. నీకోసం ప్రార్ధిస్తున్నా. నీకోసం నేనున్నా, మన అభిమానులు ఉన్నారు” అని భరోసానిచ్చారు. వెంటనే తారక్ మాటలకు జనార్ధన్ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తన అభిమాన పట్ల ధైర్యంగా ఉండూ అని చెప్పిన మాటలు నెటిజన్ల మదిని హత్తుకుంటున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. జనార్ధన్‌కు ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఎంతలా అంటే తన చేతిపై ఎన్టీఆర్ అని పచ్చబొట్టు వేయించుకుని మరి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లటం, ఇతర అభిమానులు ఎన్టీఆర్‌కు చెప్పడంతో జనార్థన్ కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.