మీరూ 3 పెళ్లిళ్లు చేస్కోండి, నా పెళ్లిళ్ల వల్లేనా జైలుకెళ్లింది?: పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

మీరూ 3 పెళ్లిళ్లు చేస్కోండి, నా పెళ్లిళ్ల వల్లేనా జైలుకెళ్లింది?: పవన్

November 12, 2019

తన మూడు పెళ్లిళ్ల  విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇంగ్లిష్ మీడియా అంశంపై మాట్లాడితే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని స్పష్టం చేశారు. తన పెళ్లిళ్ల వల్లేనా జగన్ జైలుకు వెళ్లిందని అని ఎద్దేవా చేశారు. 

pawan kalayn.

‘మీరు టీడీపీ నాయకులకు తిడితే వారు పడతారేమోగాని మేం పడం. జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి. మీరు రెండేళ్లు జైల్లో ఉన్నది నా మూడు పెళ్లిళ్ల వల్లేనా? నా పెళ్లిళ్ల  వల్లే విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టారా? అందుకే మీరిద్దరూ జైలుకెళ్లారా? మీరు ఎంత నీచంగా మాట్లాడినా మేం సంయమనం పాటిస్తున్నాం. కలాం అజాద్ పురస్కారాలు ఇచ్చే ఫంక్షన్‌లో జగన్ నా పెళ్లిళ్లు గురించి మాట్లాడతారా?  150మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనను ఎందుకు భయపడుతున్నారు. మాతో గొడవ పెట్టుకోడానికి వస్తారా? మేం రెడీ.. ’ అని అన్నారు. ఇంగ్లిష్ మీడియంపై పవన్ విమర్శలకు జగన్ స్పందిస్తూ.. ‘ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో, ఐదుగురో పిల్లలు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి’ అని అన్నారు.